Donald Trump: డొనాల్ట్ ట్రంప్ కు కానుక పంపిన పుతిన్

Putin Sends a Gift to Donald Trump

  • ట్రంప్ ప్రతినిధి మాస్కో పర్యటన సందర్భంగా బహుకరించిన రష్యా ప్రెసిడెంట్
  • పెన్సిల్వేనియా కాల్పుల్లో గాయపడ్డ ట్రంప్ క్షేమం కోసం పుతిన్ ప్రార్థించారని క్రెమ్లిన్ వెల్లడి
  • ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రయత్నం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. గతంలో పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై కాల్పులు జరగడం, ఆయన చెవికి బుల్లెట్ గాయాలు కావడం తెలిసిందే. ట్రంప్ పై హత్యాయత్నం జరిగిందని, ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసి పుతిన్ ఆందోళన చెందారని రష్యా అధికార భవనం క్రెమ్లిన్ తెలిపింది. ట్రంప్ త్వరగా కోలుకోవాలని పుతిన్ ప్రార్థనలు చేశారని వివరించింది. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ట్రంప్ కు పుతిన్ ఓ కానుక పంపించారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. ఇటీవల ట్రంప్‌ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మాస్కోలో పర్యటించారు. ఆ సమయంలో విట్‌కాఫ్‌ కు ట్రంప్ చిత్రపటాన్ని పుతిన్ అందించారు. ఆ కానుకను ప్రెసిడెంట్ ట్రంప్ కు అందజేయాలని కోరినట్లు దిమిత్రి పెస్కోవ్ వివరించారు. గతవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విట్‌కాఫ్‌ కూడా ఈ కానుక విషయం వెల్లడించారు. అది ఒక అందమైన కానుక అని చెప్పారు. ఇదిలా ఉండగా, 2018లో ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుతిన్ ఒక సాకర్ బంతిని కానుకగా పంపించారు.

  • Loading...

More Telugu News