woman suicide: పాతబస్తీ ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య

––
హైదరాబాద్ లోని పాతబస్తీలో మంగళవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే ప్రారంభించిన దబీర్ పూరా ఫ్లైఓవర్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి దూకడంతో తీవ్రగాయాలపాలై ఆమె అక్కడికక్కడే మరణించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మృతురాలిని పాతబస్తీకి చెందిన తాహనజర్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కాగా, తాహనజర్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు పేర్కొన్నారు. కుటుంబంలో గొడవలేమైనా జరిగాయా లేక మరేదైనా కారణమా అనేది తేల్చేందుకు దర్యాఫ్తు చేస్తున్నట్లు వివరించారు.