Chandrababu Naidu: నేడు, రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

- సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల సమావేశం
- తొలి రోజు వాట్సప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, లాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి తదితర అంశాలపై చర్చ
- గత సమావేశంలో చర్చించిన అంశాల ప్రగతిపై సమీక్షించనున్న సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో రెండు రోజుల పాటు సమావేశం జరగనుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే కలెక్టర్ల సమావేశంలో సీసీఎల్ఏ ప్రారంభోపన్యాసం చేయనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రులు ప్రసంగించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
తొలి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్, ల్యాండ్ సర్వే, వేసవిలో నీటి ఎద్దడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరా తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యలు, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై తొలి రోజు చర్చించనున్నారు. ఇంతకు ముందు జరిగిన కలెక్టర్ల సమావేశాల్లో చర్చించిన అంశాలపై సాధించిన ప్రగతిపై సమీక్ష చేయనున్నారు.