Mukesh Kumar: ఢిల్లీ బౌలర్ పేరిట ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డు!

ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) బౌలర్ ముకేశ్ కుమార్ ఐపీఎల్ టోర్నీ చరిత్రలోనే చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ లో కనీసం 300 బంతులేసి చెత్త ఎకానమీ రేట్ కలిగి ఉన్న బౌలర్‌గా నిలిచాడు. ముకేశ్ ఎకానమీ 10.45గా ఉండటం గమనార్హం. నిన్న విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు బౌలింగ్ చేసిన ముకేశ్ 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఓవరాల్‌గా 21 ఐపీఎల్ మ్యాచుల్లో 10.45 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ముకేశ్‌ను డీసీ యాజమాన్యం రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది.