Rishabh Pant: లక్నో కెప్టెన్ పంత్ ఖాతాలో చెత్త రికార్డు

- ఆరు బంతులు ఆడి డకౌట్ అయిన పంత్
- ఐపీఎల్‌లో ఇది సుదీర్ఘ డకౌట్
- ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 5 సార్లు డకౌట్ అయిన పంత్
ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ ఆరు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో ఇది సుదీర్ఘ డకౌట్ . కాగా, ఐపీఎల్‌లో పంత్‌కు ఇది ఐదో డకౌట్. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి పంత్ పెవిలియన్ చేరాడు.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో ఒక జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించడం ఇది ఐదోసారి. 2015లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై కోల్‌కతా నైట్ రైడర్స్, 2018లో ముంబై ఇండయన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్, 2018లో ముంబై ఇండియన్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్, 2023లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై లక్నో సూపర్ జెయింట్ జట్లు ఒక వికెట్ తేడాతో గెలుపొందాయి. ఇప్పుడు లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించాయి.