Priyadarshi: వసూళ్ల పరంగా దూసుకెళుతున్న 'కోర్ట్'

Court Movie Breaks Box Office Records

  • ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కోర్ట్' సినిమా
  • విడుదలైన మొదటి రోజే రూ.8 కోట్లకుపైగా వసూలు
  • 10 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్‌కు చేరిన వైనం

ప్రస్తుత తరుణంలో విడుదలవుతున్న చిత్రాలలో పేరుగాంచిన హీరోహీరోయిన్లు కాకపోయినా, భారీ బడ్జెట్‌తో నిర్మితం కాకపోయినా, కథాంశం (కంటెంట్) బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. విజయవంతం చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నేచురల్ స్టార్ నాని సమర్పణలో, ప్రియదర్శి ప్రధాన పాత్రలో రూపొందిన 'కోర్ట్' చిత్రం నిలుస్తోంది.

ఈ నెల 14న విడుదలైన 'కోర్ట్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా, తాజాగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది.

సినిమా విడుదలైన పది రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. గొప్ప సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకుల చారిత్రాత్మక తీర్పు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ సినిమా దాదాపు రూ.9 నుంచి రూ.10 కోట్ల బడ్జెట్‌తో నిర్మితం కాగా, సినిమాకు భారీగా ఆదాయం వస్తోంది. మరోవైపు 'కోర్ట్' సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

  • Loading...

More Telugu News