Abhishek Kolli: అమెరికాలో గుడివాడ యువకుడు అభిషేక్ అత్మహత్య

Gudivada Youths Suicide in America Abhishek Kollis Tragic End

  • కొల్లి అభిషేక్ కు ఏడాది క్రితమే వివాహం
  • భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్న యువకుడు
  • గత ఆరు నెలలుగా ఉద్యోగం లేకుండా ఉన్న అభిషేక్
  • ఇటీవల అమెరికాలో విధించిన ఆంక్షలతో మనస్తాపం!

ఏపీలోని గుడివాడకు చెందిన కొల్లి అభిషేక్ అనే యువకుడు అమెరికాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అభిషేక్ కు ఏడాది క్రితమే వివాహం జరిగింది. అతడు భార్యతో కలిసి ఫీనిక్స్ లో నివసిస్తున్నాడు. 

అయితే, కొల్లి అభిషేక్ ఆరు నెలల నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నాడు. దానికితోడు, ట్రంప్ ప్రభుత్వం వచ్చాక విధించిన ఆంక్షలతో భవిష్యత్ పై ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో అతడు బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. 

కాగా, అభిషేక్ ఆత్మహత్యతో గుడివాడలో ఉన్న అతడి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 

  • Loading...

More Telugu News