Bandi Sanjay: కేసీఆర్‌పై వ్యాఖ్యలు... బండి సంజయ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Complaint on Bandi Sanjay at Banjara Hills Police Station

  • కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతల ఆరోపణ
  • బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటన్న దాసోజు శ్రవణ్
  • కేసీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేశారన్న దాసోజు శ్రవణ్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, కిషోర్ గౌడ్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు.

అనంతరం దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, బండి సంజయ్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌పై చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.

బండి సంజయ్ ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించి ప్రింటింగ్ ప్రెస్ ఉందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ నోట్లనే పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ మీద పలుచోట్ల ఫిర్యాదు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News