Rishabh Pant: విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్ × లక్నో సూపర్ జెయింట్స్... టాస్ అప్ డేట్ ఇదిగో!

- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అక్షర్ పటేల్
- ఎల్ఎస్ జీ కెప్టెన్ గా రిషబ్ పంత్
ఐపీఎల్ లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుండడం విశేషం. ఐపీఎల్ కోసం విశాఖ స్టేడియాన్ని ఆధునికీకరించారు. కాగా, టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ తో బరిలో దిగుతోంది. ఎల్ఎస్ జీ టీమ్ కు రిషబ్ పంత్ కెప్టెన్ గా నియమితుడైన సంగతి తెలిసిందే. అటు ఢిల్లీ కూడా ఈ సీజన్ లో అక్షర్ పటేల్ సారథ్యంలో ఆడుతోంది.
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్ (కెప్టెన్), జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, ఫాఫ్ డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వి, ట్రిస్టాన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేశ్ కుమార్.
లక్నో సూపర్ జెయింట్స్
రిషబ్ పంత్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలాస్ పూరన్, ఆయుష్ బదోనీ, డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్.