Revanth Reddy: ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క

- అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీకి చేరుకున్న నేతలు
- ఢిల్లీకి వెళ్లిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులకు అధిష్ఠానం నుంచి పిలుపు రావడంతో ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోర్ కమిటీ నేతలు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారని సమాచారం.