Betting App Owners: 19 మంది బెట్టింగ్ యాప్‌ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చిన పోలీసులు

19 Betting App Owners Named in Police Investigation

  • మియాపూర్‌లో నమోదైన కేసులో యాప్ యజమానులను చేర్చిన పోలీసులు
  • వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్న పోలీసులు
  • నిందితుల జాబితాలో జిగిల్ రమ్మీ డాట్ కామ్, ఏ 23 సహా పలు యాప్‌ల  యజమానులు

బెట్టింగ్ యాప్‌ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆయా యాప్‌ల యజమానులను నిందితులుగా చేర్చారు. మియాపూర్‌లో నమోదైన కేసులో భాగంగా 19 యాప్‌ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. వారికి పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టనున్నారు.

జిగిల్ రమ్మీ డాట్ కామ్, ఏ23, యోలో 247, ఫెయిర్ ప్లే, జీత్‌విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు 365, ఎస్365, జై365, జెట్ ఎక్స్, పరిమ్యాచ్, తాజ్ 777 బుక్, ఆంధ్రా 365 యాప్‌ల యజమానులను నిందితుల జాబితాలో చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో సహా 25 మందిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News