Indian Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

- 1,078 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 307 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4.61 శాతం లాభపడ్డ ఎన్టీపీసీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ లోనూ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ సూచీ మార్కెట్లను ముందుండి నడిపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,078 పాయింట్ల భారీ లాభంతో 77,984కి చేరుకుంది. నిఫ్టీ 307 పాయింట్లు పెరిగి 23,658కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (4.61%), కోటక్ బ్యాంక్ (4.51%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.77%), టెక్ మహీంద్రా (3.54%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.14%).
టాప్ లూజర్స్:
టైటాన్ (-2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.42%), జొమాటో (-2.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.83%), భారతి ఎయిర్ టెల్ (-0.46%).