NTR: ఎన్టీఆర్ కొత్త లుక్ ఇదిగో!

- జపాన్ లో రిలీజ్ అవుతున్న దేవర
- ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన ఎన్టీఆర్
- జపాన్ లో ఎన్టీఆర్ మేనియా
జపాన్ లో తెలుగు చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ జపాన్ లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆయన నటించిన దేవర చిత్రం ఇప్పుడు జపాన్ లో విడుదల కానుంది.
దేవర జపాన్ లో రిలీజవుతున్న నేపథ్యంతో, ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ప్రస్తుతం అక్కడే ఉన్నాడు. ప్రస్తుతం అక్కడ దేవర-ఎన్టీఆర్ మేనియా నెలకొంది. ఈ క్రమంలో, ఎన్టీఆర్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. స్లిమ్ లుక్ తో తారక్ కొత్తగా కనిపిస్తుండడాన్ని ఈ ఫొటోల్లో చూడొచ్చు.
మరో విషయం ఏమిటంటే... ఎన్టీఆర్ కు జపాన్ లో అభిమాన సంఘం కూడా ఉంది. దేవర రిలీజ్ నేపథ్యంలో, టోక్యో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోషి స్పందించారు. ఎన్టీఆర్ నటనను తాము ఎంతగానో ఇష్టపడతామని వెల్లడించారు. ఆయన సినిమాలు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటాయని తెలిపారు. దేవర చిత్రం చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని యోషి చెప్పారు.
ఇక, జపాన్ లో ఎన్టీఆర్ హవా చూసి దేవర చిత్రబృందం ఆనందంతో పొంగిపోతోంది. దేవర చిత్రం జపాన్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డ్రామా జపాన్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని యూనిట్ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



