Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP Government Employees Salary Arrears Cleared

  • ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
  • రూ. 6,200 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది. జీఎల్ఐ, జీపీఎఫ్ కు చెందిన రూ. 6,200 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. రేపు లేదా ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయి. 

నిధుల విడుదలపై ఉద్యోగులు, ఎన్జీవో అసోసియేషన్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News