Kandula Durga Prasad: రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేసిన కందుల దుర్గేశ్

- రుషికొండ బీచ్ లో మెరుగుపడిన పరిస్థితులు
- మళ్లీ బ్లూఫ్లాగ్ లభించిన వైనం
- విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు బ్లూఫ్లాగ్ తోడ్పడుతుందన్న కందుల దుర్గేశ్
మంత్రి కందుల దుర్గేశ్ రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ఎగురవేశారు. కొన్ని రోజుల క్రితం రుషికొండ బీచ్ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ ను డెన్మార్క్ సంస్థ నిలిపివేసింది. అయితే బీచ్ లో పరిస్థితులు చక్కదిద్దడంతో మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ లభించింది. రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కు సంస్థ ప్రతినిధులు బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ అందజేశారు. ఈ నేపథ్యంలో మంత్రి బ్లూఫ్లాగ్ ను ఎగురవేశారు.
ఈ సందర్భంగా కందుల దుర్గేశ్ మాట్లాడుతూ... అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బ్లూఫ్లాగ్ తోడ్పడుతుందని చెప్పారు. బీచ్ పరిశుభ్రంగా ఉండేందుకు పర్యాటకులు అన్ని విధాలుగా సహకరించాలని కోరారు. ఏపీలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బ్లూఫ్లాగ్ పునరుద్ధరణ కోసం కృషి చేస్తామని మాట ఇచ్చామని... ఆ మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. మరికొన్ని ఇతర బీచ్ లకు కూడా బ్లూఫ్లాగ్ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు.