Faheem Khan: నాగపూర్‌లో చెలరేగిన హింస కేసులో నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య

Nagpur Violence Bulldozer Demolishes Accuseds House

  • సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయడంతో ఉద్రిక్తత
  • ఫహీమ్‌ఖాన్ సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు
  • కీలక నిందితుడు ఫహీమ్‌ఖాన్ అక్రమ కట్టడాలపై బుల్డోజర్ చర్య

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు కారకుడైన ప్రధాన నిందితుడు ఫహీమ్‌ఖాన్‌కు చెందిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నాగ్‌పూర్ మున్సిపల్ శాఖ అధికారులు సోమవారం ఉదయం అతడి నివాసంతో పాటు ఇతర నిర్మాణాలను బుల్డోజర్‌తో కూల్చివేశారు.

ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఇదివరకే నోటీసులు జారీ చేశామని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినందువల్లే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

మార్చి 17న నాగపూర్‌లో కొందరు వ్యక్తులు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం, మతపరమైన వస్తువులను దగ్ధం చేసినట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడంతో ఉద్రిక్తత నెలకొందని అధికారులు తెలిపారు.

ఈ తప్పుడు వదంతుల కేసులో ఫహీమ్‌ఖాన్‌తో సహా ఆరుగురిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. సైబర్ విభాగం నమోదు చేసిన నాలుగు ఎఫ్ఐఆర్‌లలో వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు 200 మంది నిందితులను గుర్తించామని, మరో వెయ్యి మందిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించే పనిలో ఉన్నామని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News