Nitesh Kumar Reddy: మహేశ్ బాబు డైలాగ్ తో ఫ్యాన్స్ ను అలరించిన నితీశ్ కుమార్ రెడ్డి... వీడియో ఇదిగో!

Nitesh Kumar Reddy Impresses Fans with Mahesh Babu Dialogue

  • దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న నితీశ్ కుమార్ రెడ్డి
  • ఎక్కడికి వెళ్లినా ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్
  • నిన్న రాజస్థాన్ రాయల్స్ పైనా ధాటిగా ఆడిన తెలుగుతేజం
  • ఫ్యాన్స్ తో సమావేశంలో పోకిరి సినిమా డైలాగ్ చెప్పిన వైనం

టాలెంటెడ్ యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఎక్కడికి వెళ్లినా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండడంలేదు. మనోడు మైదానంలో ఫీల్డింగ్ చేస్తున్నా, అభిమానుల హంగామా మరో లెవల్ లో ఉంటోంది. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. ఈ మ్యాచ్ లో నితీశ్ తనదైన శైలిలో 15 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. 

కాగా, ఎస్ఆర్ హెచ్ మేనేజ్ మెంట్ అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నితీశ్ మహేశ్ బాబు డైలాగ్ చెప్పడం అందరినీ అలరించింది. ఈ తొక్కలో మీటింగులు ఏంటో అర్థం కావడంలేదు గానీ... అందరినీ వేసేస్తే ఇంటికెళ్లిపోవచ్చు అంటూ పోకిరి సినిమాలో డైలాగ్ చెప్పాడు. దాంతో ఫ్యాన్స్ అరుపులు, కేకలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

More Telugu News