Rajendra Prasad: వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు.. వీడియో వైర‌ల్‌!

Rajendra Prasads Inappropriate Comments on David Warner Go Viral

  • నితిన్‌, వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో 'రాబిన్‌హుడ్'
  • ఈ నెల 28న విడుద‌ల కానున్న సినిమా
  • జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌
  • నిన్న హైద‌రాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌
  • ప్ర‌త్యేక అతిథిగా ఆసీస్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్‌
  • ఈవెంట్‌లో వార్న‌ర్‌ను బూతులు తిట్టిన రాజేంద్ర ప్ర‌సాద్

టాలీవుడ్ యువ హీరో నితిన్‌, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం 'రాబిన్‌హుడ్'. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించిన ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించింది. ఈ నెల 28న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

విడుదల తేదీ దగ్గర పడడంతో మేక‌ర్స్ ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు ఆసీస్ క్రికెట‌ర్ డేవిడ్‌ వార్నర్ ప్ర‌త్యేక‌ అతిథిగా విచ్చేసి సందడి చేశాడు. 

అయితే ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ వార్న‌ర్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. వేదిక‌పై రాజేంద్ర ప్ర‌సాద్‌ మాట్లాడుతూ... "హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల క‌లిసి ఈ వార్నర్ ను పట్టుకొచ్చారు. అతడ్ని క్రికెట్ ఆడమంటే.. పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు. ఈ దొంగ ము** కొడుకు.. వీడు మాములోడు కాదండి. రేయ్ వార్నర్. నీకు ఇదే నా వార్నింగ్" అని అన్నారు. 

అయితే, రాజేంద్ర ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు అర్థం కాక, వార్నర్ నవ్వుతూ కనిపించాడు. రాజేంద్ర ప్ర‌సాద్ స‌ర‌దాగానే ఈ కామెంట్స్ చేసినా ఇలా మాట్లాడ‌ట‌మేంట‌ని వార్న‌ర్ అభిమానులు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఈవెంట్ లో వార్న‌ర్ డ్యాన్స్ చేయ‌డంతో పాటు తెలుగులో మాట్లాడి అంద‌రినీ న‌వ్వించారు. 

More Telugu News