G Kishan Reddy: కార్యక్రమాలు రద్దు చేసుకుని అకస్మాత్తుగా ఢిల్లీకి కిషన్‌రెడ్డి

Kishan Reddys Sudden Trip to Delhi

   


కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నిన్న హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. నిజానికి నిన్నటి షెడ్యూలు ప్రకారం ఆయన సికింద్రాబాద్‌లో సాయంత్రం జరిగే బీహార్ దివస్‌లో పాల్గొనాల్సి ఉంది. దీనిని రద్దు చేసుకుని వెంటనే ఢిల్లీ బయలుదేరారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆయన హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, నేటి పార్లమెంటు సమావేశాల్లో మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉండటంతోనే కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News