Accheannayudu: రాయలసీమలో వడగళ్ల వాన బీభత్సం... నష్టం అంచనా వేయాలన్న మంత్రి అచ్చెన్నాయుడు

Minister Accheannayudu Orders Damage Assessment After Hailstorm in Rayalaseema districts

  • కడప, అనంతపురం జిల్లాల్లో వడగళ్ల వానలు
  • దెబ్బతిన్న పంటలు
  • అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో సంభవించిన వడగళ్ల వాన, ఈదురు గాలులు పంటలకు నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా అరటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలలో అరటి తోటలు నేలకూలాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలకూలడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రాయలసీమ జిల్లాల్లో కురిసిన వడగళ్ల వానలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెంటనే స్పందించారు. పంట నష్టాన్ని అంచనా వేయాలని ఉద్యానవన శాఖాధికారులను ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన, రైతులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సలహాలు, సహాయం అందించాలని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News