Pasala Krishna Bharati: ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి మృతి పట్ల సీఎం చంద్రబాబు స్పందన

Pasala Krishna Bharati Passes Away CM Chandrababu Naidu Pays Tribute

  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన పసల కృష్ణభారతి
  • హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచిన వైనం
  • ఎంతో బాధపడ్డానని తెలిపిన సీఎం చంద్రబాబు

ప్రముఖ గాంధేయవాది పసల కృష్ణభారతి ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. ఆమె మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. గాంధేయవాది, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారని తెలిసి ఎంతో బాధపడ్డానని వెల్లడించారు. 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల కుమార్తె అయిన కృష్ణభారతి జీవితాంతం గాంధేయవాదిగా ఉన్నారని, గాంధీజీ బోధించిన విలువలు పాటించారని చంద్రబాబు పేర్కొన్నారు. అట్టడుగు వర్గాల్లో విద్యావ్యాప్తికి కృషి చేశారని... విద్యాసంస్థలు, గోశాలలకు విరాళాలు సమకూర్చారని వివరించారు. అలాంటి మహనీయురాలు మన మధ్య లేకుండా పోవడం తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News