Vishnu Manchu: విష్ణు మంచు బ్యానర్‌పై శివ బాలాజీ, మధుమిత నటించిన ‘గోదారికే సోగ్గాన్నే’ గీతం విడుదల

Godarike Sogganne Song Release Vishnu Manchus Banner Presents Shiva Balaji and Madhumitha

 


విష్ణు మంచు ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని అవా మ్యూజిక్ బ్యానర్‌పై రియల్ లైఫ్ కపుల్ శివ బాలాజీ, మధుమిత సంయుక్తంగా నటించిన జానపద గీతం ‘గోదారికే సోగ్గాన్నే’. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ పాటను విడుదల చేశారు. ఈ గీతం విడుదల సందర్భంగా శనివారం నాడు శివ బాలాజీ, మధుమిత మీడియాతో ముచ్చటించారు. 

శివ బాలాజీ మాట్లాడుతూ... "ఈ పాటలో కంటెంట్ 8 నిమిషాలు ఉంటుంది. పాటలోనే కథ మొత్తం చెప్పాలి. ఈ కాన్సెప్ట్‌కి మ్యూజికల్ నేరేషన్ అని పేరు పెట్టాను. ముందుగా మేం నటిస్తామని అనుకోలేదు. ఈ కాన్సెప్ట్ నా వద్దకు వచ్చింది. ఆ తరువాత మధుమిత ప్రాజెక్ట్‌లోకి వచ్చింది. మేం ఇద్దరం సింగిల్ టేక్‌లో చేశాం. సెట్స్ మీద చాలా ఇంప్రోవైజ్ చేశాం. ఏ షాట్‌కి కూడా కష్టపడలేదు. ఈ పాటకు రెండు క్లైమాక్స్ ప్లాన్ చేశాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.

మధుమిత మాట్లాడుతూ... "సోషల్ మీడియాలోని ఇన్ ఫ్లూయెన్సర్‌ టాలెంట్‌ను మరింతగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మ్యూజికల్ ఆల్బమ్స్‌ను స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో నా వద్దకు ఈ పాట వచ్చింది. కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు చాలా నచ్చింది. జంటగా మమ్మల్ని అందరూ ప్రేమిస్తుంటారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇలా పాటతో జంటగా అందరి ముందుకు రాబోతున్నాం. ఇందులో మాట్లాడిన గోదారి యాస కూడా అద్భుతంగా అనిపిస్తుంది. అందరినీ ఆకట్టుకునేలా ఈ పాట ఉంటుంది" అని వివరించారు.

 అవా ఎంటర్టైన్మెంట్ సీఈఓ చిదంబరం మాట్లాడుతూ... "మంచు మోహన్ బాబు గారు, విష్ణు గారు యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో అవా మ్యూజిక్‌ను ప్రారంభించారు. మున్ముందు మరింత కంటెంట్ మా నుంచి రాబోతోంది. మాకు ఇంతలా సపోర్ట్ చేసిన విష్ణు గారికి థాంక్స్. మా పాటలో నటించిన శివ బాలాజీ గారికి, మధుమిత గారికి థాంక్స్" అని వెల్లడించారు.

More Telugu News