David Warner: 'రాబిన్ హుడ్' సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డేవిడ్ వార్నర్

David Warner in Hyderabad for Robin Hood Promotions

  • 'రాబిన్ హుడ్' సినిమాలో నటించిన క్రికెటర్ డేవిడ్ వార్నర్
  • నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • హాజరుకానున్న వార్నర్
  • నితిన్, శ్రీలీల జంటగా 'రాబిన్ హుడ్' మూవీ
  • వెంకీ కుడుముల దర్శకత్వంలో చిత్రం

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ చిత్రం 'రాబిన్ హుడ్' లో నటించిన సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో వార్నర్ పాత్ర పేరు డేవిడ్. కాగా, 'రాబిన్ హుడ్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేందుకు వార్నర్ నేడు నగరానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో చిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం పలికింది. వార్నర్‌ను చూసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎంతో ఆసక్తి కనబరిచారు. హైదరాబాదులో ఈ సాయంత్రం 'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. 

కాగా, వార్నర్ పాత్ర సినిమా ప్రారంభం నుంచి వినిపిస్తూనే ఉంటుందని, వార్నర్‌ను ఎంపిక చేయడం వెనుక దర్శకుడు వెంకీ కుడుముల ఆలోచన ఉందని హీరో నితిన్ తెలిపారు. వెంకీ కుడుముల వెంటనే వార్నర్‌ను సంప్రదించి పాత్ర గురించి చెప్పగా, ఆయన వెంటనే అంగీకరించారని నితిన్ వెల్లడించారు. ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని, ద్వితీయార్థంలో వార్నర్ పాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

కాగా, డేవిడ్ వార్నర్‌కు సోషల్ మీడియాలో విశేష రీతిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా డైలాగులు, పాటలతో సరదా వీడియోలు చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ముఖ్యంగా అల్లు అర్జున్ స్వాగ్ ను ఇమిటేట్ చేస్తూ వీడియోలు పెడుతుంటాడు. బన్నీ కూడా వార్నర్ ఆటకు, వీడియోలకు అభిమాని.

ఈ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని 'రాబిన్ హుడ్' చిత్ర బృందం ఆయనను తమ సినిమాలో భాగం చేసింది. మార్చి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

  • Loading...

More Telugu News