Panna Pemmasani: బీసీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ: కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని

- వైసీపీని వీడి టీడీపీలో చేరిన వడ్డెర నేతలు
- గుంటూరులో కార్యక్రమం
- వడ్డెర నేతలకు టీడీపీ కండువాలు కప్పిన పెమ్మసాని
ఇవాళ వడ్డెర సామాజిక వర్గ నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గుంటూరులో కేంద్ర సహాయమంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సమక్షంలో వారు టీడీపీ కండువాలు కప్పుకున్నారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, బీసీలకు జాతీయస్థాయిలో రాజకీయ గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో బీసీలు అన్ని రకాలుగా మోసపోయారని, వైసీపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు.