Sunil Yadav: ‘హత్య’ సినిమాపై వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు.. ఐదుగురిపై కేసు నమోదు.. ఒకరి అరెస్ట్

Sunil Yadav Files Complaint Against Hatya Movie

  • వివేకా హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్
  • ‘హత్య’ సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సీన్లు పెట్టారని ఫిర్యాదు
  • సినిమా దర్శకుడు, నిర్మాత, రచయితలపై కేసు నమోదు
  • ‘వైఎస్ అవినాశ్ రెడ్డి అన్న యూత్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ పవన్ కుమార్ అరెస్ట్

‘హత్య’ సినిమాలో తనను, తన తల్లిని అవమానించేలా సన్నివేశాలు చిత్రీకరించారంటూ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల క్రితం కడపలో ఎస్పీని కలిసి ఇదే అంశంపై ఫిర్యాదు చేసిన సునీల్ యాదవ్.. నిన్న వేకువజామున తల్లితో కలిసి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డీఎస్పీ మురళీ నాయక్‌‌‌కు ఫిర్యాదు చేశాడు. 

ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ‘హత్య’ సినిమా డైరెక్టర్, నిర్మాత, రచయితలను నిందితులుగా చేర్చారు. ఈ సినిమాలోని సన్నివేశాలను ‘వైఎస్ అవినాశ్ రెడ్డి అన్న యూత్’ పేరుతో వాట్సాప్ గ్రూపులో పోస్టు చేసి వైరల్ చేసినట్టు సునీల్ యాదవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఆ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ పవన్ కుమార్‌ను ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చగా, వైసీపీ కడప సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌ను రెండో ముద్దాయిగా చేర్చారు. మరికొందరిపైనా కేసు నమోదు చేశారు. అనంతరం శనివారం మధ్యాహ్నం పవన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప సైబర్ క్రైం స్టేషన్‌లో విచారణ అనంతరం పులివెందులకు తరలించారు. కాగా, వివేకా హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ 39 నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 

  • Loading...

More Telugu News