Varra Ravindar Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి బెయిల్

Varra Ravindar Reddy Gets Bail

  • సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డి
  • జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పీఎస్ లో కేసు
  • నేడు బెయిల్ మంజూరు చేసిన స్థానిక కోర్టు

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డికి బెయిల్ లభించింది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో రవీంద్రారెడ్డికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించడంతో వర్రా రవీంద్రారెడ్డి జగ్గయ్యపేట జైలు నుంచి విడుదలయ్యాడు. 

అటు, వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు కూడా ఉన్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై వర్రా రవీంద్రారెడ్డి అసభ్య పోస్టులు పెట్టగా, ఆ పోస్టులు తొలగించమని అడిగితే తనను కులం పేరుతో దూషించాడంటూ కడప జిల్లా జనసేన కార్యకర్త వెంకటాద్రి నందలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఆ తర్వాత ఈ కేసును పులివెందులకు బదిలీ చేశారు. ఇదే కేసులో సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News