IPL 2025: అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్-2025... తొలి మ్యాచ్ లో కేకేఆర్ × ఆర్సీబీ

Watch KKR vs RCB IPL 2025s First Epic Clash

  • నేటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్
  • మే 25 వరకు పోటీలు
  • కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు ప్రారంభ మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు

అభిమానులకు పక్కా క్రికెట్ ఎంటర్టయిన్మెంట్ అందించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేసింది. నేటి నుంచి ఐపీఎల్-2025 షురూ కానుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడుతున్నాయి. 

టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో కేకేఆర్ జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. 6 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. 4 పరుగులే చేసిన డాషింగ్ ఓపెనర్ క్వింటన్ డికాక్... హేజెల్ వుడ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ అజింక్యా రహానే (39 బ్యాటింగ్), ఓపెనర్ సునీల్ నరైన్ (17 బ్యాటింగ్) ఉన్నారు. రహానే దూకుడుగా ఆడుతున్నాడు. 16 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.

అంతకుముందు, ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ అట్టహాసంగా జరిగింది. కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. దిశా పటానీ డ్యాన్స్, శ్రేయా ఘోషల్, కరణ్ ఔజ్లా పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

  • Loading...

More Telugu News