Niranjan: మార్కాపురంలో పాము పిల్లల కలకలం

- మార్కాపురం పట్టణ శివారులో 15 రోజుల క్రితం గుడ్లు పెట్టిన పాములు
- స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చిన స్థానికులు
- 120 గుడ్లను సేకరించి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచిన స్నేక్ క్యాచర్
- వాటిలో నుంచి బయటకొచ్చిన 80 పాము పిల్లలు
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో 80 పాము పిల్లలు బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. మార్కాపురం పట్టణ శివారులో సుమారు 15 రోజుల క్రితం రెండు పాములు గుడ్లు పెట్టాయి. ఈ విషయాన్ని స్థానికులు స్నేక్ క్యాచర్ నిరంజన్‌కు తెలియజేశారు.
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ నిరంజన్ 120 పాము గుడ్లను సేకరించి అటవీశాఖ కార్యాలయంలో భద్రపరిచారు. రెండు పాములకు చెందిన ఆ గుడ్లను వేర్వేరు డబ్బాల్లో ఇసుకలో ఉంచి పొదిగించినట్లు ఆయన తెలిపారు. వాటిలో నుంచి 80 పాము పిల్లలు బయటకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.