Posani Krishna Murali: గుంటూరు జైలు నుండి విడుదలైన పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali Released from Guntur Jail

  • నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • రెండు వారాలకు ఒకసారి సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశం
  • పోసానికి జైలు బయట స్వాగతం పలికిన అంబటి రాంబాబు

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరు జిల్లా కారాగారం నుండి విడుదలయ్యారు. పోసానికి నిన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు వారాలకు ఒకసారి సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలని ఆదేశించింది. జైలు నుంచి బయటకు వచ్చిన పోసానికి వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్వాగతం పలికారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కారులో ఇంటికి వెళ్లారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో పోసాని అరెస్టయ్యారు. సీఐడీ కోర్టు పోసానికి నిన్న బెయిల్ మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో జాప్యం కావడంతో విడుదల ప్రక్రియ ఆలస్యమైంది. అన్ని ఫార్మాలిటీలు పూర్తి కావడంతో నేడు సాయంత్రం విడుదలయ్యారు.

More Telugu News