Vinod Kumar Shukla: జ్ఞానపీఠ్ అవార్డు పురస్కారానికి ఎంపికైన హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా

- ఛత్తీస్‌గఢ్ నుంచి అత్యున్నత సాహిత్య పురస్కారం అందుకున్న మొదటి రచయిత శుక్లా
- సాహిత్యానికి అందించిన విశిష్ఠ సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ్ అవార్డు అందజేత
- దేశంలో అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ్
ప్రఖ్యాత హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా 2024 సంవత్సరానికి గాను జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జ్ఞానపీఠ్ కమిటీ శనివారం అధికారికంగా ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న తొలి రచయితగా వినోద్ కుమార్ శుక్లా నిలిచారు.
భారతీయ సాహిత్యానికి ఆయన చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా ఈ జ్ఞానపీఠ్ అవార్డును ప్రదానం చేయనున్నారు. దేశంలోనే ఇది అత్యున్నతమైన సాహిత్య పురస్కారంగా పరిగణించబడుతుంది. ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయితగా శుక్లా గుర్తింపు పొందారు. ఈ పురస్కారంలో భాగంగా రూ. 11 లక్షల నగదు బహుమతితో పాటు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు.
హిందీ సాహిత్యంలో ఆయన చేసిన కృషికి, ఆయన యొక్క విలక్షణమైన రచనా శైలికి గాను ఈ అవార్డు లభించింది. ఇదివరకే, 1999లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు.