Anchor Shyamala: తెలంగాణ హైకోర్టుకు యాంకర్ శ్యామల

- బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
- శ్యామల పిటిషన్ పై ఈరోజు విచారణ
- బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పీఎస్‌లో శ్యామలపై కేసు
యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది. కాగా, బెట్టింగ్ యాప్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో శ్యామలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఇక సామాజిక మాధ్యమాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ రీతూచౌదరి, టీవీ యాంకర్ విష్ణుప్రియలను గురువారం పంజాగుట్ట పీఎస్‌లో సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు ప్రముఖ యూట్యూబర్లపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తీవ్ర పోరాటం చేస్తున్నారు.