Telangana: తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం

Telangana 10th Class Exams Begin

  • ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు
  • మొత్తం 2,650 ప‌రీక్షా కేంద్రాల్లో ప‌రీక్ష‌లు రాయ‌నున్న 5,09,403 మంది విద్యార్థులు
  • ఎగ్జామ్ ప్రారంభ‌మైన 5 నిమిషాల వ‌ర‌కు విద్యార్థుల‌ను ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తి 
  • ఏప్రిల్ 4తో ముగియ‌నున్న‌ ప‌రీక్ష‌లు

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మ‌య్యాయి. విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద డీఈఓ, ఎంఈఓ, త‌హ‌సీల్దారుల ఫోన్ నంబ‌ర్లు ఉంచారు. ఏదైనా స‌మ‌స్య వ‌స్తే వారి దృష్టికి తీసుకెళ్లాల‌ని అధికారులు తెలిపారు.  

ఉద‌యం 9.30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఎగ్జామ్ ప్రారంభ‌మైన 5 నిమిషాల వ‌ర‌కు విద్యార్థుల‌ను ప‌రీక్షా కేంద్రాల్లోకి అనుమ‌తిస్తారు.

మొత్తం 2,650 ప‌రీక్షా కేంద్రాల్లో 5,09,403 మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. విద్యార్థుల‌ను త‌నిఖీలు చేసి ప‌రీక్ష కేంద్రాల్లోకి అనుమ‌తించారు. ఈసారి 24 పేజీల బుక్‌లెట్ విధానం అందుబాటులోకి వ‌చ్చింది. ఏప్రిల్ 4తో ఎగ్జామ్స్ ముగుస్తాయి. 


  • Loading...

More Telugu News