Rana: రానా, విజయ్ దేవరకొండ సహా పలువురు నటులపై కేసు

Telugu Actors Rana And Vijay Deverakonda Booked in Betting App Case

  • బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై పోలీసులు సీరియస్
  • మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసులు
  • అరెస్టు భయంతో దేశం వదిలి పారిపోయిన యూట్యూబర్లు

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారిపై తెలంగాణ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే పదకొండు మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీసులు మరో 25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు. ప్రదీప్ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండలతో పాటు మొత్తం 25 మందిపై కేసు నమోదు చేశారు. ఇందులో నటీనటులు, యూట్యూబర్లు ఉన్నారు.

కేసు నమోదైన ప్రముఖులలో ప్రకాశ్‌ రాజ్‌, మంచు లక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, యాంకర్‌ శ్యామల, నీతూ అగర్వాల్‌, విష్ణుప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్‌, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్‌, పద్మావతి, పండు, ఇమ్రాన్‌ఖాన్‌, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ, బండారు సుప్రీత తదితరులు ఉన్నారు. వీరిలో టేస్టీ తేజ మంగళవారం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. గురువారం యాంకర్ విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. యూట్యూబర్లు హర్ష సాయి, పరేషాన్ భాయ్స్ ఇమ్రాన్ అరెస్టు భయంతో దుబాయ్ కి పారిపోయారని ప్రచారం జరుగుతోంది.

  • Loading...

More Telugu News