Chiranjeevi: లండన్‌లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న చిరంజీవి.. ఇదిగో వీడియో!

- యూకే పార్లమెంటులో చిరంజీవికి అరుదైన సత్కారం
- సినీ, సమాజ సేవ రంగాల్లో ఆయన చేస్తున్న కృషికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో వేడుక
- చిరు పురస్కారం అందుకున్న ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్
మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అత్యున్నత పురస్కారం చేరింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చిరు చేసిన సేవలకుగానూ యూకే పార్లమెంటులో బ్రిడ్జ్ ఇండియా సంస్థ, కల్చరల్ లీడర్షిప్ ద్వారా 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ప్రదానం చేసింది.
బ్రిటన్ కి చెందిన అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో పురస్కార ప్రదానోత్సవ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మాన్ తదితరులు పాల్గొన్నారు. మెగాస్టార్ పురస్కారం అందుకున్న ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. వీటిపై మెగా అభిమానులు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
ఇక గతేడాది ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం, పద్మవిభూషణ్ అవార్డులను చిరు అందుకున్న సంగతి తెలిసిందే. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, ఐఫా-అవుట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా గౌరవం కూడా చిరంజీవికి దక్కింది.