Vodafone Idea: వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు శుభవార్త.. అందుబాటులోకి 5జీ సేవలు

Vodafone Idea Launches 5G Services in Mumbai

  • ముంబైలో ప్రారంభమైన వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు
  • వచ్చే నెలలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్‌లకు సేవల విస్తరణ
  • రూ. 299 ప్యాక్‌ నుంచి 5జీ సేవలు 

వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు ఇది శుభవార్తే. ఆ సంస్థ నుంచి 5జీ సేవలు నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. అయితే, ప్రస్తుతానికి ఈ సేవలు ముంబైలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెలలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్‌లకు సేవలను విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో 17 సర్కిళ్లలోని 100 నగరాలకు 5జీ సేవలను విస్తరించనుంది. 

ప్రస్తుతానికి అపరిమిత యాడ్ ఆన్ కింద రూ. 299తో మొదలయ్యే పథకాల్లో 5జీ సేవలు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. తొలి దశ విస్తరణ అనంతరం మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, చెన్నైలకు 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆ సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్‌సింగ్ తెలిపారు. ఫైబర్ కేబుళ్లు, సెల్ టవర్లు వంటి సంప్రదాయ అనుసంధాన వసతులు లేని ప్రదేశాల్లో శాటిలైట్ సేవల కోసం కొన్ని సంస్థలతో చర్చిస్తున్నట్టు జగ్బీర్‌సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News