Yuzvendra Chahal: చాహ‌ల్‌-ధ‌న‌శ్రీ విడాకుల‌పై రేపు తీర్పు... భ‌ర‌ణం ఎంతంటే...!

High Court Orders Verdict in Chahal and Dhanshree Divorce Case

  • వీరి విడాకుల‌పై రేప‌టిలోగా తీర్పు ఇవ్వాల‌ని ఫ్యామిలీ కోర్టుకు బాంబే హైకోర్టు ఆదేశం
  • చాహ‌ల్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున రేప‌టిలోగా తీర్పు ఇవ్వాల‌ని సూచ‌న‌
  • ధ‌న‌శ్రీకి రూ. 4.75కోట్ల భ‌ర‌ణం చెల్లించ‌డానికి చాహ‌ల్ అంగీకారం

టీమిండియా క్రికెట‌ర్‌ యుజ్వేంద్ర చాహ‌ల్‌, ధ‌న‌శ్రీ వ‌ర్మ విడాకులు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. వీరి విడాకుల‌ పిటిష‌న్‌పై రేప‌టిలోగా తీర్పు ఇవ్వాల‌ని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్య‌వ‌ధిని మిన‌హాయించాల‌న్న పిటిష‌న్‌ను ఫ్యామిలీ కోర్టు తిర‌స్క‌రించ‌గా, ఆ నిర్ణ‌యాన్ని హైకోర్టు ర‌ద్దు చేసింది. 

చాహ‌ల్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున రేప‌టిలోగా తీర్పు ఇవ్వాల‌ని సూచించింది. కాగా, ఈ దంప‌తుల‌కు 2020లో పెళ్ల‌వ‌గా, కొంత‌కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇక ధ‌న‌శ్రీకి చాహ‌ల్ రూ. 4.75కోట్ల భ‌ర‌ణం చెల్లించ‌డానికి అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. 

కాగా, ఈసారి ఐపీఎల్‌లో ఈ స్పిన్న‌ర్ పంజాబ్ కింగ్స్ త‌ర‌ఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. గ‌త సీజ‌న్ వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)కు ఆడిన చాహ‌ల్‌ను గ‌తేడాది న‌వంబ‌ర్‌లో జరిగిన మెగా వేలంలో పంజాబ్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విష‌యం తెలిసిందే.  

More Telugu News