Niharika Konidela: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదల రెండో సినిమా

Niharika Konidelas Second Film Under Pink Elephant Pictures

  • పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో మొద‌టి సినిమాగా కమిటీ కుర్రోళ్లు 
  • నిర్మాత‌గా నిహారిక తొలి చిత్రంతోనే గ్రాండ్‌ సక్సెస్ 
  • ఇప్పుడు ఫిమేల్ డైరెక్టర్ మానస శర్మతో రెండో సినిమా

మెగా డాట‌ర్ నిహారిక కొణిద‌ల త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో రెండో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ బ్యాన‌ర్‌లో గ‌తేడాది మొద‌టి సినిమాగా కమిటీ కుర్రోళ్లు అనే చిత్రం వ‌చ్చిన విష‌యం తెలిసిందే. నిర్మాత‌గా నిహారిక తొలి చిత్రంతోనే గ్రాండ్‌ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు రెండో సినిమాను ఫిమేల్ డైరెక్టర్ మానస శర్మతో చేయబోతున్నారు.

మానస శర్మ గతంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా 'ఒక చిన్న ఫ్యామిలి స్టోరీ' (జీ5 వెబ్ సిరీస్), అలాగే డైరెక్టర్ గా 'బెంచ్ లైఫ్' (సోనీ లివ్ వెబ్ సిరీస్) చేశారు. ఇప్పుడు మానస శర్మ  పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో 3వ ప్రాజెక్టుగా ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్ల‌డికానున్నాయి. 

  • Loading...

More Telugu News