Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లు.. ముంబయి ఇండియన్సే టాప్!

- మరో మూడు రోజుల్లో ఐపీఎల్-2025 సీజన్ ప్రారంభం
- ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ముంబయి ఇండియన్స్
- 2008 నుంచి 2024 వరకు ఎంఐ కొట్టిన సిక్సర్ల సంఖ్య 1,681
మరో మూడు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2025 సీజన్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 22న ఈడెన్ గార్డెన్స్ లో జరిగే డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మ్యాచ్ తో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. అయితే, 2008 నుంచి 2024 వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన జట్లపై ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం.
ఈ జాబితాలో ముంబయి ఇండియన్స్(ఎంఐ) టాప్‌లో ఉంది. ఇప్పటివరకు ఎంఐ జట్టు 1,681 సిక్సర్లు కొట్టింది. ఆ తర్వాత వరుసగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)- 1,649, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)- 1,513, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)- 1,508, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)- 1,492, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)- 1,348, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)- 1,235, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్)- 1,038, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)- 332, గుజరాత్ టైటాన్స్ (జీటీ)- 270, డెక్కన్ ఛార్జర్స్ (డీఈసీ)-400, పూణే వారియర్స్ ఇండియా (పీడబ్ల్యూఐ)- 196, గుజరాత్ లయన్స్- 155, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ (ఆర్‌పీఎస్)-157, కొచ్చి టస్కర్స్ కేరళ (కేటీకే)- 53 ఉన్నాయి.