Chandrababu Naidu: తానా సభలకు రావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

TANA Invites Andhra Pradesh CM Chandrababu for annual summit

  • జులై 3 నుంచి తానా సభలు
  • నేడు సీఎం చంద్రబాబును కలిసిన తానా ప్రతినిధులు 
  • చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేత 

తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రతినిధులు నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. తానా సమావేశాలకు రావాలంటూ ఆయనను ఆహ్వానించారు. ఈ ఏడాది తానా సభలు జులై 3 నుంచి 5వ తేదీ వరకు అమెరికాలోని డెట్రాయిట్ లో నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో తానా చైర్మన్ గంగాధర్ నాదెళ్ల, తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా, తానా మాజీ అధ్యక్షుడు జయరామం కోమటి తదితరులు ఉన్నారు. వారు చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందజేశారు.

  • Loading...

More Telugu News