Indian Labor Unions: ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాల పిలుపు

India wide Labor Strike Planned for May 20th

  • కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగాల సమాఖ్యల సమావేశం
  • సమ్మెపై రెండు నెలల పాటు ప్రచారం
  • లేబర్ కోడ్ రద్దు, నెలవారీ కనీస వేతనం సహా వివిధ డిమాండ్లతో సమ్మె

ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటు పలు డిమాండ్లతో మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు వివిధ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర రంగాల సమాఖ్యలు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్మిక జాతీయ సమావేశం జరిగింది. దేశవ్యాప్త సమ్మెపై రెండు నెలల పాటు ప్రచారం నిర్వహించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

లేబర్ కోడ్ రద్దు చేయడం, ఇండియన్ లేబర్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం, నెలవారీ కనీస వేతనం రూ. 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9,000 అందించడం సహా పలు డిమాండ్లు ఉన్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఏ పథకం కిందకు రానివారికి నెలకు రూ. 6,000 ఇవ్వాలని కూడా యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. 

రెండు నెలల తర్వాత నిర్వహించే సమ్మె, భవిష్యత్తులో కార్మికులు, రైతుల దేశవ్యాప్త నిర్ణయాత్మక పోరాటాలకు నాంది పలుకుతుందని కార్మిక సంఘాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

  • Loading...

More Telugu News