Revanth Reddy: ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

Gummadi Narsaiah meets Revanth Reddy

  • అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసిన గుమ్మడి నర్సయ్య
  • మాజీ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరించిన సీఎం
  • సీఎంను కలిసేందుకు అవకాశమివ్వడం లేదంటూ ఇటీవల నర్సయ్య ఆవేదన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య కలిశారు. ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. రేవంత్ రెడ్డికి గుమ్మడి నర్సయ్య ఒక లేఖను అందజేశారు. మాజీ ఎమ్మెల్యేను రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు.

ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ సుమారు పదిహేను రోజుల క్రితం గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి పలుమార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే ఆపేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ లభించడంతో ఈరోజు ఆయనను కలిశారు.

More Telugu News