PM Modi: ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' లో ఖాతా తెరిచిన ప్రధాని మోదీ

- మోదీ ప్రసంగ వీడియోను ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
- ట్రంప్‌కు ధన్యవాదాలు తెలిపిన మోదీ
- ట్రూత్ సోషల్‌లో చేరడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో సోషల్ మీడియా ఖాతా తెరిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఆయన ఖాతా తెరిచారు. ఈ విషయాన్ని మోదీ స్వయంగా వెల్లడిస్తూ .. 'హౌడీ మోదీ' సందర్భంగా ట్రంప్‌తో దిగిన ఒక ఫోటోను పోస్టు చేశారు.
ట్రూత్ సోషల్‌లో చేరడం సంతోషంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు వేచి చూస్తున్నానని రాసుకొచ్చారు.
కాగా, 'మోదీ ట్రూత్ సోషల్'లో ఖాతా ప్రారంభించడానికి ముందు మోదీకి సంబంధించిన ఓ వీడియోను ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను ట్రంప్ పోస్టు చేయడం పట్ల ఆయనకు మోదీ ధన్యవాదాలు తెలిపారు.
అంతర్జాతీయ వ్యవహారాలు మొదలుకొని భారత సాంస్కృతిక విశేషాలు, తన జీవిత ప్రయాణంతో పాటు అనేక విషయాలను ఈ పాడ్ కాస్ట్ లో పంచుకున్నట్లు మోదీ చెప్పారు.