Revanth Reddy: ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

- ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ
- అఖిలపక్షంతో వచ్చి కలుస్తామని పేర్కొన్న ముఖ్యమంత్రి
- బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం మద్దతు కావాలన్న ముఖ్యమంత్రి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతూ ఆయన లేఖ రాశారు. అఖిలపక్ష సమావేశానికి సమయమివ్వాలని కోరారు. రాష్ట్రంలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, సీపీఐ పార్టీలతో కూడిన ప్రతినిధులతో వచ్చి కలుస్తామని, అందుకు సమయం ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును శాసనసభ ఆమోదించిన విషయాన్ని ఈ లేఖలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలని కోరారు. రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాలలో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తీసుకువచ్చిన రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది.