Revanth Reddy: అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy meets Achampet MLA Vamshikrishna

  • అనారోగ్యంతో స్టార్ ఆసుపత్రిలో చేరిన వంశీకృష్ణ
  • ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన ముఖ్యమంత్రి
  • వైద్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణను పరామర్శించారు. వంశీకృష్ణ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంశీకృష్ణను ముఖ్యమంత్రి పరామర్శించారు.

అనంతరం వైద్యులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంశీకృష్ణ త్వరగా కోలుకొని, తిరిగి ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News