KTR: మాకు చాలా విషయాలు తెలుసు... వాస్తవాలు చెబితే రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు: కేటీఆర్

KTR hot comments on Revanth Reddy

  • బీజేపీ నేతలతో రహస్య సమావేశాలను ఎందుకు ఖండించడం లేదని ప్రశ్న
  • రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • రేవంత్ రెడ్డి బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి అప్రూవర్‌గా మారాడని వ్యాఖ్య

"మాకు చాలా విషయాలు తెలుసు. మేం వాస్తవాలు చెబితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇబ్బందులు తప్పవు" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలతో రహస్య సమావేశాలను ఆయన ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. రహస్య భేటీలు అవాస్తవమైతే ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి రూ. 70 వేల కోట్ల ఆదాయం తగ్గిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని వెల్లడించారు. ఇంతకంటే రాష్ట్రానికి ఘోర అవమానం మరొకటి ఉండదని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి బడ్జెట్ కంటే ముందే నేరాన్ని అంగీకరించి అప్రూవర్‌గా మారారని అన్నారు.

తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అట్టర్ ఫ్లాప్ అని అంగీకరించినట్లేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి ముఖ్యమంత్రి అవలంబిస్తోన్న విధానాలే కారణమని ఆయన అన్నారు. కేసీఆర్ మీద ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును బంద్ పెట్టి సాగును నాశనం చేశారని మండిపడ్డారు.

ఫార్ములా ఈ-రేస్ వద్దని చెప్పిన ముఖ్యమంత్రి నగరంలో అందాల పోటీల నిర్వహణతో ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అందాల పోటీలకు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసే బదులు మహిళలకు రూ. 2,500 చొప్పున ఇవ్వాలని సూచించారు. ఈ రేస్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ కేసును విచారిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News