Ravichandran Ashwin: ధోనీ ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు: అశ్విన్

Ashwin heaps praise on MS Dhoni

  • ధర్మశాలలో 100వ టెస్టు ఆడిన అశ్విన్
  • ధోనీ చేతుల మీదుగా జ్ఞాపిక అందుకోవాలని ఆశపడిన తమిళ తంబి
  • ధోనీ ఆ కార్యక్రమానికి రాకపోవడంతో నిరాశ
  • తాజా ఐపీఎల్ సీజన్ లో సీఎస్కే జట్టుకు ఎంపికైన అశ్విన్
  • ధోనీ వల్లే తాను సీఎస్కే జట్టుకు ఆడుతున్నానని వెల్లడి
  • ధోనీ ఇచ్చిన కానుక ఇదేనని వివరణ

రవిచంద్రన్ అశ్విన్... టీమిండియాలో పోరాటతత్వానికి మారుపేరుగా నిలిచే ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్. ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించని ఈ తమిళ తంబి అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినా, ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరించనున్నాడు. ఐపీఎల్ 18వ సీజన్ లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడు. 

కెరీర్ చరమాంకంలో తన సొంతగడ్డ అయిన తమిళనాడు బేస్డ్ టీమ్ కు ఆడనుండడం అతడికి ఓ కానుక వంటిదే అని చెప్పొచ్చు. అశ్విన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అందుకు క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీకి థ్యాంక్స్ చెబుతున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ ఆసక్తికర అంశం వెల్లడించాడు. 

"ధర్మశాల వేదికగా 100వ టెస్టు ఆడాను. ఆ మ్యాచ్ లో బీసీసీఐ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి మెమెంటోను ప్రదానం చేసింది. అయితే ధోనీ ఆ కార్యక్రమానికి వస్తాడని, ధోనీ చేతుల మీదుగా ఆ జ్ఞాపికను అందుకోవాలని భావించిన నాకు నిరాశ కలిగింది. ఇదే నాకు చివరి మ్యాచ్ అవుతుందేమో అనుకున్నాను. 

కానీ, ధోనీ ఆ తర్వాత నాకు ఊహించని రీతిలో గిఫ్ట్ ఇచ్చాడు. నన్ను మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకోవడం ద్వారా బహుమతి ఇచ్చాడు. ధోనీ వల్లే నేను ఈసారి సీఎస్కేలో ఆడుతున్నాను... అందుకు ధోనీకి థాంక్స్ చెబుతున్నాను. ఈ దశలో ఇంతకంటే మంచి కానుక మరొకటి ఉంటుందని అనుకోవడంలేదు" అని వివరించాడు. 

  • Loading...

More Telugu News