Monkey: శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి... ఫోన్ సొంతదారు ఏంచేశాడంటే...!

Vrindavan man gets his phone back from a monkey

 


కోతి చేష్టలు అని పెద్దలు ఊరికే అనలేదు. కోతులు చేసే పనులు జనాలను ఎంత ఇబ్బందులకు గురి చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చేతిలోని వస్తువులను లాక్కెళ్లడం, పైగా పళ్లు బయటపెట్టి బెదిరించడం వంటి వంటి చర్యలతో కోతులు అంటేనే ప్రజలు హడలిపోతుంటారు. తాజాగా కోతి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో జరిగిందీ ఘటన. ఓ వ్యక్తికి చెందిన శాంసంగ్ ఎస్25 అల్ట్రా ఫోన్ ను లాగేసుకున్న కోతి గోడెక్కి కూర్చుంది. ఈ ఫోన్ ధర రూ.1.50 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఆ ఫోన్ సొంతదారుడు ఎంతో తెలివిగా ఆలోచించి, తన ఫోన్ ను తిరిగి దక్కించుకున్నాడు. కొన్ని మ్యాంగో డ్రింక్ ప్యాకెట్లను కొనుగోలు చేసిన ఆ వ్యక్తి... ఒక ప్యాకెట్ ను కోతి ఉన్న దిశగా విసిరాడు... అయితే ఆ ప్యాకెట్ కోతికి దూరంగా పడింది. 

మరో ప్యాకెట్ కరెక్టుగా కోతి చేతుల్లో పడింది. దాంతో కోతి ఆ మ్యాంగో డ్రింక్ ప్యాకెట్ తీసుకుని, ఫోన్ ను కిందికి జారవిడించింది. ఆ వ్యక్తి తన ఫోన్ ను అందుకుని అక్కడ్నించి నిష్క్రమించాడు. ఈ ఘటన హోలీ రోజున జరిగినట్టు తెలుస్తోంది.

More Telugu News