MLC Mallanna: కేటీఆర్‌తో తీన్మార్ మ‌ల్ల‌న్న భేటీ

MLC Mallanna Meets KTR in Telangana Assembly

  • అసెంబ్లీ వేదిక‌గా తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం
  • కేటీఆర్, హ‌రీశ్ రావుతో తీన్మార్ మ‌ల్ల‌న్న స‌మావేశం 
  • బీసీ నేత‌ల‌తో క‌లిసి కేటీఆర్‌కు మ‌ల్ల‌న్న మెమొరాండం

అసెంబ్లీ వేదిక‌గా తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ బ‌హిష్కృత‌నేత‌, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)... బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, హ‌రీశ్ రావుతో భేటీ అయ్యారు. బీసీ రిజ‌ర్వేష‌న్ బిల్లుపై స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని బీఆర్ఎస్ నేత‌ల‌ను కోరారు. బీసీ నేత‌ల‌తో క‌లిసి కేటీఆర్‌కు మ‌ల్ల‌న్న మెమొరాండం అందించారు. అలాగే బీసీ బిల్లుకు కేంద్రం చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించేలా ఢిల్లీ వేదిక‌గా తాము చేయ‌బోయే ధ‌ర్నాకు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందిగా తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీ నేత‌ల‌ను కోరారు. వీరి భేటీపై సోష‌ల్ మీడియాలో భిన్న‌స్వ‌రాలు వినిపిస్తున్నాయి.   

కాగా, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో మ‌ల్ల‌న్న‌ను ఈ నెల 1న పార్టీ నుంచి కాంగ్రెస్ సస్పెండ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయ‌న‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, తీన్మార్ మల్లన్న నుంచి ఎలాంటి వివరణ రాలేదు. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. 

  • Loading...

More Telugu News