Rajiv Yuva Vikasam: తెలంగాణలో నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త.. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ

Telangana CM Revanth Reddy Will Launch Rajiv Yuva Vikas Scheme Today

  • స్వయం ఉపాధి కోరుకునే యువత కోసం ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో పథకం
  • నేడు దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించనున్న సీఎం రేవంత్
  • రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు
  • దరఖాస్తులకు ఏప్రిల్ 5 వరకు గడువు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘రాజీవ్ యువ వికాసం’ పేరుతో నేటి నుంచి ఓ కొత్త పథకం అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా స్వయం ఉపాధి కోరుకునే యువతకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల సహకారంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం రూ. 6 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 5 లక్షల మందికి ఈ పథకం కింద సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు ఈ పథకంలో భాగంగా దరఖాస్తు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకంపై నిన్న బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. 

  • Loading...

More Telugu News