PM Modi: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లలో ఏది బెస్ట్... మోదీ ఆన్సర్ ఇదే!

recent results show indian cricket team is better than pakistan modi

  • తాను క్రికెట్ నిపుణుడిని కాదన్న ప్రధాని మోదీ
  • ఆటపై అవగాహన ఉన్న వారు మాత్రమే దానిని విశ్లేషించగలరని అంటూనే..
  • ఇటీవల జరిగిన మ్యాచ్ ఫలితమే ఏ జట్టు మెరుగైనదో తేల్చిందని వ్యాఖ్య

పాకిస్థాన్ కంటే భారత క్రికెట్ జట్టు మెరుగైనదన్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా వెల్లడించారు. అమెరికా పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మ్యాన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ క్రీడా సంబంధిత ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 

క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు చిరకాల ప్రత్యర్థులు అన్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లలో ఏది ఉత్తమమైంది అన్న ప్రశ్నకు ప్రధాని మోదీ సమాధానమిస్తూ .. తాను క్రికెట్ నిపుణుడిని కాదని, ఆటలో మెళకువలు తనకు తెలియదని అన్నారు. కేవలం ఆటపై అవగాహన ఉన్న వారు మాత్రమే దానిని విశ్లేషించగలరని అభిప్రాయపడ్డారు. 

కొన్నిరోజుల క్రితం జరిగిన భారత్ – పాక్ మ్యాచ్ ఫలితమే ఏ జట్టు మెరుగైనదో తేల్చిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఛాంపియన్ ట్రోఫీని భారత్ జట్టు గెలుచుకున్న విషయాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.  

  • Loading...

More Telugu News